BREAKING
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు.. పారదర్శకంగా కౌన్సెలింగ్ క్వార్టర్లలో అక్రమ మోటార్ల తొలగింపు ఎన్నికలు వస్తాయి-పోతాయి.. బంధాలే శాశ్వతం..!! ఓసీపీ-3 సీహెచ్‌పీని సందర్శించిన డైరెక్టర్ తిరుమలరావు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా జాతీయ సైన్స్ డే ఎక్స్‌పో ఐఎఫ్ఎఫ్ఐ 2026 విజేతల జాబితా.. కాంతార చాప్టర్ 1కు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు చిన్న సినిమాలకు ప్రత్యేక థియేటర్ పాలసీ కావాలి.. షెరాజ్ మెహదీ డిమాండ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు

దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో

Select Suryaa Now
దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దేశభక్తి ఇతివృత్తంతో తెరకెక్కిన మిసెస్ కల్నల్ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఘనంగా విడుదల చేశారు. ఆది క్రియేషన్స్ బ్యానర్‌పై విలోక్, కౌశిక్ సమర్పణలో సాయి కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకరం ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శనివారం విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది.

టీజర్ లాంఛ్ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు శ్రీకరం ప్రభాకర్, మిసెస్ కల్నల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నానని తెలిపారు. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని శ్రమించామని, కేవలం లేడీ ఓరియెంటెడ్ కథగానే కాకుండా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులను అలరించేలా రూపొందించామని చెప్పారు. నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ, ప్రభాకర్‌తో కలిసి ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.

కథానాయిక ప్రియా హెగ్డే మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు తమకు ఎన్నో మధురానుభూతులు, సవాళ్లతో కూడిన మూడేళ్ల ప్రయాణమని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాత ధైర్యంగా నిలబడ్డారని, వెయ్యి శాతం కష్టపడి చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశభక్తి కథాంశంలో హీరోగా నటించడం తన కెరీర్‌లో ప్రత్యేకమని చిరాగ్ జానీ చెప్పగా, తమ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మహేష్ విట్టా, మాన్య గౌడ, ఎడిటర్ కార్తికేయన్ విశ్వాసం వ్యక్తం చేశారు.