BREAKING
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల

పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తండేల్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న నాగచైతన్య, కమర్షియల్ సినిమా మారుతున్న తీరు, సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోలింగ్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కమర్షియల్ విజయం అనే భావన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పదేళ్ల క్రితం కమర్షియల్ సినిమా గురించి అడిగితే ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉండాలని చెప్పేవారని, అవి లేకపోతే సినిమానే కాదనే పరిస్థితి ఉండేదని నాగచైతన్య గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులు మారాయని, అనవసరంగా ఐదు పాటలు ఎందుకు, కథను సాగదీయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సంప్రదాయ ఫైట్లు పెడితే సోషల్ మీడియాలో పాత ఫార్మాట్ సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారని, అందుకే అప్పటి కమర్షియల్ సినిమా ఫార్ములా ఇప్పుడు లేదని అభిప్రాయపడ్డారు.

ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలను చూడాలనుకుంటున్నారని, తాను కూడా అలాంటి విభిన్నమైన కథతో విజయం సాధిస్తే అదే నిజమైన కమర్షియల్ విజయమని నాగచైతన్య పేర్కొన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన వృషకర్మలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.