BREAKING
సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు

వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు

Select Suryaa Now
వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వృషకర్మ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. సినిమా ప్రారంభమైన మొదటి పది నిమిషాలను ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దని, మొదటి సెకండ్ నుంచే కథ ఒక ఫ్లోలో సాగుతుందని మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ట్రైలర్‌కు లభించిన స్పందన తమ బాధ్యతను మరింత పెంచిందని, సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు.

విరూపాక్షతో భిన్నమైన హారర్ అనుభూతిని అందించిన తర్వాత, వృషకర్మను మరో తరహా జానర్‌లో కొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించామని కార్తీక్ దండు చెప్పారు. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ అనుభూతి, అడ్రినలిన్ రష్ కలిగేలా ఈ సినిమాను రూపొందించామని, ముఖ్యంగా తొలి పది నిమిషాలు చూస్తేనే అసలైన కథా గమనం సరిగ్గా కనెక్ట్ అవుతుందని స్పష్టం చేశారు. ఆలస్యంగా థియేటర్లకు రాకుండా మొదటి నుంచే సినిమాను చూడాలని ఆయన కోరారు.

ఈ ప్రాజెక్టు కోసం చిత్రబృందం ప్రాణం పెట్టి కష్టపడి పనిచేసిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని దర్శకుడు తెలిపారు. డిసెంబర్ 4న తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమాను చూడాలని, సక్సెస్ మీట్‌లో ప్రతి ఒక్కరి గురించి వివరంగా మాట్లాడతానని కార్తీక్ దండు పేర్కొన్నారు.