BREAKING
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల

నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ

Select Suryaa Now
నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:భవిష్యత్తులో డబ్బు, ఆస్తుల కోసం కాకుండా నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు వస్తాయని ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ అన్నారు. నీరు లేనిదే జీవితం లేదని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఘట్‌కేసర్‌ కొండాపూర్ లోని విఘ్నాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లో 'ఎర్త్ డే – వాటర్ ఈజ్ లైఫ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలీ మాట్లాడుతూ విదేశాల్లో తాగునీటి కోసం ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో నీటి ధరలు రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటున్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితులు మన దేశంలో రాకుండా ఇప్పటి నుంచే నీటి వనరులను సంరక్షించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ప్లాస్టిక్ కంపెనీల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమానికి విఘ్నాన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. అప్పారావు నాయుడు అధ్యక్షత వహించగా, ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ కోసం కృషి చేస్తున్న డాక్టర్ జస్వీన్ జైరత్, సుభాష్ చంద్రారెడ్డిలను సత్కరించారు. విద్యార్థులు ప్రార్థనా గీతం, స్వాగత నృత్యం, నీటి సంరక్షణపై మైమ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ సారధి, చక్రధర్, పద్మిని పాటిల్, రామదానం రమేష్, రివచ్ మాచర్ల తదితరులు పాల్గొన్నారు.