BREAKING
చిన్న సినిమాలకు ప్రత్యేక థియేటర్ పాలసీ కావాలి.. షెరాజ్ మెహదీ డిమాండ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ

వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన

Select Suryaa Now
వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : విద్యార్థుల్లో వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రతాప్‌సింగారం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక సందర్శన చేపట్టారు. 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులు శుక్రవారం భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న వివిధ వృత్తి శిక్షణ విభాగాలను పరిశీలించారు.ప్రధానోపాధ్యాయుడు ఎం. రవికుమార్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పర్యటనలో ఐటీ, ఐటీఈఎస్ విద్యార్థులు శిక్షకురాలు జి. ధనలక్ష్మి ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ కార్యాలయ నిర్వహణ విధానాలను పరిశీలించి సాంకేతిక అంశాలపై అవగాహన పొందారు. బ్యూటీ అండ్ వెల్‌నెస్ విద్యార్థులు శిక్షకురాలు వి. సునీత నేతృత్వంలో చర్మ, కేశ సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఎం. రవికుమార్ మాట్లాడుతూ.. పుస్తకాల్లో నేర్చుకున్న విద్యకు క్షేత్రస్థాయి అనుభవం జోడించినప్పుడే విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇలాంటి సందర్శనలు విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను గుర్తించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.