BREAKING
చిన్న సినిమాలకు ప్రత్యేక థియేటర్ పాలసీ కావాలి.. షెరాజ్ మెహదీ డిమాండ్ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి బాలయ్య వివేక్ ఆత్రేయ కురుక్షేత్రం ప్రాజెక్టుకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా మురుగు నీటి నిల్వ.. దుర్వాసతో ప్రజల అవస్థలుపడుతున్నారు. దేశభక్తి నేపథ్యంలో మిసెస్ కల్నల్ టీజర్ విడుదల.. ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రోమో డిసెంబర్ 1న పరకాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు-పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తొలి వికలాంగ పింఛన్‌తో విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ.. చందు గొప్ప మనసు నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ

నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు

Select Suryaa Now
నిబంధనల మేరకే చెకుముకి సైన్స్ సంబరాలు

గీసుగొండ , మేజర్ న్యూస్, తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిబంధనల మెరకే చెకుముకి సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నామని,సామాజిక కార్యకర్త ముసుగులో అధికారుల పై బానోతు రేవంత్ రాథోడ్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గీసుగొండ ఎంఈఓ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉషోదయ హైస్కూల్ ప్రభుత్వ ఆమోదంతో నడుస్తున్నటువంటి పాఠశాల అని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాలు చేపట్టిన వాటిని కట్టడి చేసి వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుందన్నారు. చేకుముకి సైన్స్ సంబరాలు 2026 కార్యక్రమం విద్యార్థులలో శాస్త్రీయత జిజ్ఞాస నెలకొల్పడానికి ఒక ప్రైవేటు సంస్థ చెకుముకి ఆర్గనైజేషన్ చేస్తుందని అందులో భాగంగా ఉషోదయ పబ్లిక్ స్కూల్లో వెన్యూ చేసుకోవడానికి ప్రభుత్వ అధికారుల ప్రమేయం అవసరం లేదన్నారు.డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ప్రొసీడింగ్ ఆర్సి నంబర్ 855322(3631)టి. ఎస్ఎస్/పిడిఓ /2024 తేదీ 26- 10 -2026 సూచనల మేరకు విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞ్యాస నెలకొల్పడానికి ఒక షెడ్యూల్ ఇచ్చారని,ఆ షెడ్యూల్ ప్రకారం డీఈఓలు ఆదేశించారని,అందులో భాగంగా మండలంలో చెకుముకి జిల్లా ఆర్గనైజేషన్ కార్యక్రమం చేపడుతుందని పేర్కొన్నారు.దీనికి సామాజిక కార్యకర్త రేవంత్ ఆరోపించినట్టుగా ప్రైవేటు సంస్థలకు పెట్టుకోమని గాని,ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించినట్టుగా అధికారుల చర్యలు ఏమాత్రం లేవన్నారు.అవెన్యూ మార్చుకోమని గాని అదే వెన్యూలో పెట్టమని గానీ ప్రభుత్వాధికారుల ఎవరి సూచనలు లేవని,సామాజిక కార్యకర్తను అని చెప్పుకుంటూ ప్రభుత్వానిబంధనలు తెలియకుండానే అధికారులను వాట్సప్ రూపంలో బెదిరించడం సరైంది కాదన్నారు.రెండు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ వారి ఇష్టం వచ్చిన వెన్యూను ఎంచుకునే అధికారం వారికుంటుందని,ప్రైవేటు వ్యక్తులు ఎంచుకున్న వెన్యూ పై అధికారులను,మీడియాను,ప్రజల్ని తప్పుదారి పట్టించడం మంచిది కాదన్నారు.ఆ వెన్యూ మార్చకపోతే ఆ కంప్లైంట్ ఇస్తా అంటూ బెదిరింపులకు పాల్పడటం,పత్రికలలో తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి,విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులలో అవకతవకలు ఉన్నాయని బూచి చూపెడుతున్నారని మండిపడ్డారు.
ఫీజులలో ప్రభుత్వానిబంధనల మేరకు కాకుండా ఏం సాక్ష్యాలు ఉన్న ప్రభుత్వ అధికారులకు,పేరెంట్స్ ద్వారా గాని విద్యార్థుల ద్వారా గాని విన్నవిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అన్నారు.పత్రికలలో వెలువరించిన ఫీజుల వివరాలు అటు పత్రికల ముందుగానే ఇటు అధికారులు ముందుగానే వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.సామాజిక కార్యకర్త పేరుతో సోషల్ మీడియాలో సంస్థల్ని,అధికారుకారులపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే సహించమని,ప్రజాస్వామ్యబద్ధంగా చర్య తీసుకుంటామని అన్నారు.

రిపోర్టర్ ;విష్ణు చందర్, గీసుకొండ ,వరంగల్ జిల్లా