BREAKING
ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026

నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్

Select Suryaa Now
నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక సినిమాలోనైనా డ్యాన్స్ చేయాలని గతంలో తనకు కోరిక ఉండేదని, అయితే ఇప్పుడు తాను నిజంగా స్టెప్పులేసినా ప్రేక్షకులు అది ఏఐ వీడియో అని భావించే ప్రమాదం ఉందని ఆయన చమత్కరించారు. అగోరా కార్యక్రమంలో పాల్గొన్న మమ్ముట్టి, సోషల్ మీడియా రీల్స్‌లో తనపై వస్తున్న ఏఐ డ్యాన్స్ వీడియోలను ప్రస్తావిస్తూ సభలో నవ్వులు పూయించారు.

తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్‌తో యువత రకరకాల వీడియోలు సృష్టిస్తున్నారని, తన జీవితంలో ఎప్పుడూ ఊహించని రీతిలో డ్యాన్స్ చేస్తున్నట్లు రీల్స్ కనిపిస్తున్నాయని మమ్ముట్టి పేర్కొన్నారు. అందుకే సినిమాలో డ్యాన్స్ చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేశానని సరదాగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా తాను కష్టపడి డ్యాన్స్ చేసినా జనం నమ్మే పరిస్థితి లేకపోవడం ఈ తరం సాంకేతిక మార్పులకు నిదర్శనమని ఆయన అన్నారు.

అయితే హాస్యంగా మాట్లాడినప్పటికీ, ఏఐ దుర్వినియోగంపై మమ్ముట్టి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శక్తిమంతమైన వ్యక్తుల చేతుల్లోకి లేదా నియంతల చేతుల్లోకి ఈ సాంకేతికత వెళితే సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తప్పుడు ఉద్దేశాలతో ఏఐని ఉపయోగిస్తే మానవ స్వేచ్ఛ, దైనందిన జీవితాలపై నియంత్రణ ఏర్పడే ముప్పు పొంచి ఉందని, ఈ అంశంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.