నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నీరో చిత్రం గ్లింప్స్ విడుదలైంది. గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణ చక్రవర్తి త్రిపురనేని దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బోయపాటి శ్రీను, దర్శకుడు తాను నమ్మిన కథనే తెరకెక్కించాలని అనుకుంటారని, కల్యాణ చక్రవర్తి గతంలో తన సినిమాలకు పాటలతో పాటు స్క్రిప్ట్ చర్చల్లోనూ పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన తప్పకుండా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనే నమ్మకం ఉందని, విడుదలైన గ్లింప్స్‌తోనే ఆ విషయం స్పష్టమవుతోందని తెలిపారు. సినిమాలో ఏది ఎంత ఉండాలో అంతా సమపాళ్లలో ఉందని ప్రశంసించారు.
గ్లింప్స్‌లో అరవింద్ నటనలో మంచి ఇంపాక్ట్ కనిపించిందని, ప్రేక్షకులను కట్టిపడేసే హావభావాలు చూపించారని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. నీరో చిత్రంతో ఒక మంచి హీరో పరిచయమయ్యాడనే పేరు అరవింద్‌కు, ఆ హీరోను వెండితెరకు పరిచయం చేశారనే పేరు కల్యాణ చక్రవర్తికి దక్కాలని ఆకాంక్షించారు. కొత్త ప్రతిభతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.