భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు
చేగుంట;భారతదేశం రాజ్యాంగం పై దేశ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన అవసరమని మెదక్ ఎం.పీ రఘునందన్ రావు అన్నారు. మండల కేంద్రమైన చేగుంట లోని పి ఎం సి ల పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు చల్ల లక్ష్మణ్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటోలను ఆయన ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయిన, ఆంగ్లేయుల పాలనలో ఏర్పాటుచేసిన మెకాలే విద్యా విధానం ఇంకా కొనసాగడం శోచనీయమన్నారు. ఆ విద్యా విధానానికి ఇకనైనా స్వస్తి పలకాలని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి, విధుల గురించి పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్రపతి, గవర్నర్ కొనసాగుతారని, వారి అనుమతితోనే కేంద్రంలో,రాష్ట్రంలో చట్టాలు తయారు అవుతాయని తెలిపారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల వివరాలను సేకరించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశ జాతీయ గీతం, జాతీయ గేయం లను అవమానిస్తే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ డిఇఓ రాజు చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్ మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయులు రాజేశ్వర్,రఘుపతి, రాధ, రమ,రమాదేవి, సురేందర్,మనోహర్రావు,వెంకటేష్,సరస్వతి, శ్రీవాణి, రేఖ, ఉమా, ఉమామహేశ్వరి,హిమవర్ష, సి.ఆర్. పి రమేష్, తపస్ రాష్ట్ర జిల్లా బాధ్యులు నవాజ్ సురేష్,రంగారెడ్డి,ఎల్లం, సిద్దు, బిజెపి చేగుంట మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.