BREAKING
వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి

కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్

Select Suryaa Now
కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్

కొల్చారం;కొల్చారం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో ఉన్న కంకర మిషన్ వద్దకు వచ్చిపోయే టిప్పర్ లారీలు అతివేగంగా,  అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. గుర్తు తెలియని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో గ్రామంలోని స్మశాన వాటిక కమాన్ కూలిపోయిందని, అధిక బరువుతో వెళ్లిన మరో టిప్పర్ లారీ ధాటికి మురుగు కాలువ కూలిపోయిందని ఆరోపిస్తూ గ్రామస్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొత్త కాలనీ నుండి కంకర మిషన్ వద్దకు వెళ్లే రోడ్డుపై కూర్చొని కంకర మిషన్ వద్దకు వచ్చి పోయే లారీలను నిలిపివేశారు. కంకర మిషన్ యజమానులు స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కంకర రవాణా చేస్తున్న సమయంలో రోడ్డుపై నీళ్లు చల్లకపోవడం వల్ల దుమ్ము రేగుతుందని ఆరోపించారు. అంతేగాకుండా మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి వద్దనుండి కంకర మిషన్ కు వెళ్లే దారిలో సిసి రోడ్డు వేయించి ఇస్తామని కంకర మిషన్ యజమానులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్సై మొయినుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు మొండికేయడంతో యజమానులు వచ్చేవరకు వేచి ఉన్నారు. అనంతరం కంకర మిషన్ యజమానులు ఘటన స్థలానికి చేరుకుని కూలిపోయిన స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి కూలిన నిర్మాణాలకు మరమ్మత్తులు చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. సిసి రోడ్డు నిర్మాణ పనులు సైతం పరిశీలిస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు.