BREAKING
వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి

అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు.

Select Suryaa Now
అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు.

అల్లాదుర్గం;అల్లాదుర్గం. ప్రజా, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన అల్లాదుర్గం చౌరస్తా నుండి మెటల్ కుంట వరకు రోడ్డు అద్వాన స్థితిపై తెలంగాణ లోకాయుక్త కు ఫిర్యాదు చేయడమే కాకుండా, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడం జరిగిందని సింగూర్ జలాల సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గతంలో ఈ రోడ్డు దుస్థితి పై కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుకు మరమ్మత్తులు చేశామని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చారని  ఆరోపించారు. ఈ రోడ్డు ప్రయాణించాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును బాగు చేశామని కోర్టుకు తప్పుడు నివేదికలు అధికారులు ఇచ్చారని గుర్తించి, లోకాయుక్త  లో మరల కేసు వేయడం జరిగిందని ఈనెల 25న జరిగిన విచారణలో అల్లాదుర్గం -మెటల్ కుంట రోడ్డు అద్వాన స్థితిని సాక్షాదారులతో సహా కోర్టుకు వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు బాగు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్న, ప్రజలకు సురక్షితమైన రహదారిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. గతంలో లోకాయుక్తకు తప్పుడు నివేదికల సమర్పించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అత్యంత ప్రాధాన్యమున్న ఈ రహదారిని వెంటనే ప్రభుత్వం టెండర్లకు పిలిచి, మరమత్తు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.