రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక
కౌడిపల్లి; మండల పరిధిలోని తునికి ఎంజెపి విద్యార్థి మంగా విట్టు జిల్లా స్థాయి అండర్-17 ఫెన్సింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు, పీడీ అంజలి, పీఈటీ శేఖర్ భరత్ విద్యార్థిని అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.