గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు
తూప్రాన్;తూప్రాన్ మండలం, గుండారెడ్డిపల్లి రైతు వేదికలో రైతులకు నేల ఆరోగ్య కార్డుపై అవగాహన నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజేంద్రనగర్ నుంచి వ్యవసాయ అధికారులు కవిత, సిహెచ్ గజలక్ష్మి రైతులకు నేల ఆరోగ్య కార్డు ప్రాముఖ్యత, ఎరువుల మోతాదు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచుకోవడం గురించి వివరించారు.నేల పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు వేయాలని, దీని వల్ల ఖర్చు తగ్గి, నేల సారం పెరిగి, అధిక దిగుబడి వస్తుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ వందన రైతులు తదితరులు పాల్గొన్నారు,