BREAKING
వృత్తి విద్యపై విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల కవాతు: ఎస్సై అనిల్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ నా కెరీర్‌ను మార్చేసింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి

సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి

Select Suryaa Now
సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి

కీసర, మేజర్ న్యూస్: సమాజంలో నెలకొన్న అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.కీసర డివిజన్ డంపింగ్ యార్డు సమీపంలోని జిన్నారం కాలనీలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కాలనీవాసులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు విద్య అందించడంతో పాటు సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం జ్యోతిరావు పూలే నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో చైతన్యం, మార్పు సాధ్యమని చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, కీసర డివిజన్ అధ్యక్షుడు కోల బాలరాజ్ యాదవ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి దేశం రమేష్ గౌడ్, జిన్నారం మాజీ వార్డు సభ్యుడు డొంకేని రమేష్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ యాదవ్, జిన్నారం వేణు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు.అనంతరం బీజేపీ నాయకుడు కోటేశ్వరరావు మనవరాలు సాక్షిక మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నాయకులు చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.