BREAKING
ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం

Select Suryaa Now
జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం

మేడ్చల్,మేజర్ న్యూస్:మహాత్మా జ్యోతిరావు పూలే 139వ వర్ధంతిని పురస్కరించుకుని మేడ్చల్ నగరంలోని చెక్‌పోస్ట్ వద్ద ములంగిరి శ్రీహరి చారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నివాళులర్పించి ఆయన చేసిన సామాజిక సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాలకు విద్య అందించడమే లక్ష్యంగా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, సామాజిక చైతన్యానికి బాటలు వేశారని కొనియాడారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి చేసిన కృషి భారత సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
విద్య ద్వారానే సమాజంలో అజ్ఞానం, అసమానతలు, కుల వివక్షను తొలగించవచ్చని తన ఆచరణ ద్వారా నిరూపించిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను నేటి తరానికి గుర్తుచేస్తూ, విద్యా సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలనే సంకల్పంతో ఆయన జయంతిని జరుపుకోవడం ఎంతో ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు.స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వార్షిక ఆదాయంలో కనీసం 10 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కానుగంటి వంశీ, వంజరి నడికప్పు లింగం, బీఎస్పీ నాయకులు విజయ్ ఆనంద్, దండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.