BREAKING
డిసెంబర్ 2న జిల్లా స్థాయి యువజనోత్సవం:DYSO పి. నర్సింహులు పాత ఫార్మాట్ సినిమా అంటే ట్రోల్స్ చేస్తున్నారు.. కమర్షియల్ విజయంపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు ఘనంగా పరిగి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు శతక సాహిత్యం-సామాజిక స్పృహ అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే : డాక్టర్ గజ్జల పది సినిమాల కంటే నాలుగు మంచి సినిమాలు మేలు.. కృష్ణ బూరుగుల ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. జనవరిలో వేడుకలు నీరు లేనిదే జీవితం లేదు.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి: సినీ నటుడు అలీ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కృత్తికా శుక్ల రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

Select Suryaa Now
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

నర్సాపూర్;పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, సమిష్టిగా కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీఓ మహమ్మద్ మొజ్జం హుస్సేన్ పిలుపునిచ్చారు.శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ఎంపీఓ మహమ్మద్ మొజ్జం హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఆనంద్ యాదవ్‌తో కలిసి గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, వాటిని నిర్దేశించిన విధంగా పారవేయాలని సూచించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.