ఓసీపీ-3 సీహెచ్‌పీని సందర్శించిన డైరెక్టర్ తిరుమలరావు
సూర్య, సెంటినరీకాలనీ సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 పరిధిలో ఉన్న సీహెచ్‌పీని శనివారం సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమల రావు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీడీకే-6 సీహెచ్‌పీ 5 ఎంటీపీఏ ప్రాజెక్టు పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్‌ఓటు జీఎం మాలోత్ రాముడు, జీఎం (సీహెచ్‌పీ) కె. శ్రీనివాసులు, డీజీఎం (ఈ అండ్ ఎం) డి. బాలాజీ రావు, డీజీఎం (ఈ అండ్ ఎం) ఎస్. కరీముల్లా, ఎస్‌ఈ (ఈ అండ్ ఎం) ఆర్. కేశవరావుతో పాటు ఏఈఎస్ఎల్ కంపెనీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.