BREAKING
కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ అంబేద్కర్ 70వ వర్ధంతి సభను విజయవంతం చేయాలి చిన్నారుల ఆలోచనలకు రెక్కలు.. 250 అద్భుత ఆవిష్కరణలు! దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి! గ్రంథపాలకుడు నాగవెల్లి రామ్ మోహన్‌కు ఘన వీడ్కోలు మహాత్మా జ్యోతిరావు ఫూలేకు బీజేపీ నేతల ఘన నివాళి దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి చల్లూరు నూతన సొసైటీ ఏర్పాటుపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం

క్వార్టర్లలో అక్రమ మోటార్ల తొలగింపు

Select Suryaa Now
క్వార్టర్లలో  అక్రమ మోటార్ల తొలగింపు



సూర్య, సెంటినరీకాలనీ  :సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో సివిల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎం సుంకర మధుసూదన్ ఆదేశాల మేరకు డీజీఎం సల్లం రవికుమార్ ఆధ్వర్యంలో సివిల్ సూపర్వైజర్  బెల్లం శ్రీనివాస్  కాలనీ లో పర్యటించి క్వార్టర్ల వద్ద నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ నల్లాలకు ఏర్పాటు చేసిన అక్రమ మోటార్లను తొలగించే చర్యలు చేపట్టారు. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు. అనంతరం క్వార్టర్ల వెనుక భాగంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మురుగునీటి పారుదల పరిస్థితులను తనిఖీ చేశారు.  నిర్వహణ, పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. కాలనీ లో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను సక్రమంగా పనిచేయడానికి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిబ్బంది పాషా, తదితరులు పాల్గొన్నారు.