BREAKING
కొండగట్టు అంజన్నకు రాజన్న ఆలయం పట్టు వస్త్రాలు హుజురాబాద్ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ -- సూర్య వార్తకు స్పందన సబ్ జైలులో న్యాయవిజ్ఞాన సదస్సు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వo ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి -- ప్రజా సంఘాల జేఏసీ రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి క్రీడల్లో రజిత పథకం పొందిన ఏసీపీ మాధవికి ఘన సన్మానం శ్రీకాంతాచారి ఫ్లెక్సీ తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్ అంబేద్కర్ 70వ వర్ధంతి సభను విజయవంతం చేయాలి చిన్నారుల ఆలోచనలకు రెక్కలు.. 250 అద్భుత ఆవిష్కరణలు! దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి! గ్రంథపాలకుడు నాగవెల్లి రామ్ మోహన్‌కు ఘన వీడ్కోలు మహాత్మా జ్యోతిరావు ఫూలేకు బీజేపీ నేతల ఘన నివాళి దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి చల్లూరు నూతన సొసైటీ ఏర్పాటుపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం

ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు.. పారదర్శకంగా కౌన్సెలింగ్

Select Suryaa Now
ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు.. పారదర్శకంగా కౌన్సెలింగ్


సూర్య, సెంటినరీకాలనీ  :సింగరేణి ఉద్యోగుల సంక్షేమం లో భాగంగా ఆర్జీ-2 ఏరియా పరిధిలోని సెక్టార్-3 కాలనీలో ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపునకు యాజమాన్యం శనివారం పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించింది. గ్రూప్-1 పరిధిలోని ఆర్జీ-2 ఏరియా, ఆర్జీ-3లోని ఓసీపీ-1, ఆర్జీ-1లోని జెడీకే-11 ఇంక్లైన్‌కు చెందిన అర్హులైన ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. 8వ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సెక్టార్-3 కాలనీలో అందుబాటులో ఉన్న 473 క్వార్టర్లకు గాను 102 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 35 మంది ఉద్యోగులు హాజరుకాగా, వారిలో 23 మంది తమకు నచ్చిన క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఓటు జీఎం మాలోతు రాముడు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్వార్టర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా సీనియారిటీ ప్రాతిపదికన నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి పని సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం మాలోతు రాముడు, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ గంధం సాంబశివరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సింగ్ శ్రీనివాస్, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ సునీత, సివిల్ ఈఈ సోనియా, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శాంసన్, జూనియర్ అసిస్టెంట్ శ్రీలేఖ, క్వార్టర్ సెక్షన్ గార్డ్ రాజ్ కుమార్, సేవా కోఆర్డినేటర్ గొర్రె అనూష తదితరులు పాల్గొన్నారు.