BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

Select Suryaa Now
పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

 

ఎన్నికలు – విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు

జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి
పాలకొండ,మేజర్ న్యూస్ 
జిల్లాలో నవంబర్ 29వ తేదీ ఆదివారం పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది నిర్ణీత సమయానికి ముందుగానే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఎన్నికల విధులకు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు గుర్తింపును, ఓటర్ల జాబితాలో పేరును నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని, ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల నిబంధనల ప్రకారం సహాయం చేయాలని, పోలింగ్ కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని తెలిపారు. పోలింగ్ మరియు కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. అదే విధంగా పోలింగ్ సిబ్బంది ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించరాదని, ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడటం, ఒత్తిడి చేయడం, ఓటు రహస్యాన్ని వెల్లడించడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. అనధికార వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదని, ఎన్నికల కేంద్రాల్లో రాజకీయ ప్రచారం, పార్టీ గుర్తుల ప్రదర్శనకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. ఎన్నికల సామగ్రిని నిర్లక్ష్యంగా నిర్వహించడం, అనుమతి లేకుండా విధుల నుంచి బయటకు వెళ్లడం, ఎన్నికలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవడం చేయరాదన్నారు. పోలింగ్ మరియు కౌంటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల రికార్డులను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భద్రపరిచి సంబంధిత అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేసి రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు