BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి

Select Suryaa Now
దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి

విజయవాడ రూరల్, మేజర్ న్యూస్: నోట్‌బుక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆదివారం నున్నలోని సామ్రాజ్య రిసార్ట్స్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో 52వ కార్తీక వన సమారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ వేడుకలను కుటుంబ సమేతంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అఖిల భారత కాగితపు వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు కిషన్ సింగ్ ఠాగూర్, ఉపాధ్యక్షుడు వివిడి రమేష్, తెలంగాణ సంఘం అధ్యక్షుడు అభిషేక్ మాట్లాడుతూ.. కాగితంపై 18 శాతం వస్తు సేవల పన్ను ఉండగా, నోట్‌బుక్‌లపై పన్ను మినహాయింపు ఉండటంతో తయారీదారులు పన్ను రాయితీ పొందలేక నష్టపోతున్నారని తెలిపారు. కాగితపు మిల్లుల అదనపు చార్జీలతో ఉత్పత్తి వ్యయం పెరిగి, విదేశీ దిగుమతుల పోటీ కారణంగా దేశీయ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాగితం, నోట్‌బుక్‌లు, అనుబంధ ఉత్పత్తులపై ఒకే విధంగా 5 శాతం పన్ను విధించాలని కోరారు. ఈ సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి, సామూహిక వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మఫాత్ లాల్ జైన్, ఉపాధ్యక్షుడు భావేష్ రాజ్ పురోహిత్, సంయుక్త కార్యదర్శి వివేక్, ప్రసాద్, హరినాథ్, అవినాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.