జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో వి.కె. శీనానాయక్, వేదపండితులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం జస్టిస్ భట్టి మల్లేశ్వరస్వామివారిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.