BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి

Select Suryaa Now
గొల్లపల్లి  ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిడిపి మద్దతుదారురాలు
చొక్కా రెడ్డి గారి గీత ఏకగ్రీవమయ్యారు. మిగిలిన ఎనిమిది వార్డులకు ఆదివారం ఎన్నికల పోలింగ్ జరిగింది. వాటిలో ఆరు వార్డులు తెలుగుదేశం మద్దతుదారులు విజయం సాధించారు. కేవలం రెండు వార్డుల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మెజార్టీ వార్డు మెంబర్ లందరూ ఉప సర్పంచ్ గా పూడి 
బిందు మాధవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత, ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి  లు ఎన్నికైనట్లు డిక్లరేషన్  అందుకున్నారు. అనంతరం సర్పంచ్ గీత, ఉప సర్పంచ్ బిందు మాధవి లు మాట్లాడుతూ  తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ పరిధిలో ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తామని చెప్పారు. పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్వర్ణ గ్రామ పంచాయతీగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీలలో  తాగునీటి సమస్య లేకుండా చేయడం, వీధిలైట్లు ఏర్పాటు చేయడం, అండర్ డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  అనంతరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రజలు బాలసంచా పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ 
విజయోత్సవ సంబరాలలో చొక్కారెడ్డి మనోహర్ రెడ్డి, సర్పంచ్ భర్త విజయ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ భర్త  వంశీ కృష్ణ రెడ్డి, కదిరి మంగళం వెంకట రామిరెడ్డి, కే. నవీన్ కుమార్ రెడ్డి, పీ. రూప,కోటాల చంద్ర శేఖర్ రెడ్డి, ఎన్ ఈశ్వరచారి, సి. చెంగారెడ్డి,
విజయ భాస్కర్ రెడ్డి, ఏ. చెంగారెడ్డ్, ఏ. నవీన్, సి. వెంకట్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.