BREAKING
కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా

కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

Select Suryaa Now
కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

విజయవాడ రూరల్, మేజర్ న్యూస్: నున్న ప్రాంతంలోని వివిధ మామిడి తోటల్లో ఆదివారం నిర్వహించిన కార్తీక వన సమారాధన వేడుకల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయల్ క్లబ్ అసోసియేషన్, దుర్గాపురం వాకర్స్ క్లబ్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం, అంతర్జాతీయ వైశ్య సమాఖ్య, డ్యూటీ గణేష్ సేవా సమితి సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని నిర్వాహకులు, సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక వన సమారాధనలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ప్రకృతి ఒడిలో నిర్వహించే వన భోజనాలు ప్రజలకు మానసిక ప్రశాంతతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తాయని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయడం వల్ల సమాజంలో ఐక్యత, సోదరభావం, ఆత్మీయ అనుబంధాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఆయా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.