శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు
గుడ్లవల్లేరు మేజర్ న్యూస్ : మండలంలోని వేమవరం గ్రామములో వేంచేసియున్న కొండలమ్మ అమ్మవారి దేవస్థానములో ఆదివారం సంధర్భంగా అమ్మవారిని సుమారు 7,000 పైగా భక్తులు దర్శించుకొనినారు. అత్యధిక స్థాయిలో భక్తులు అమ్మవారికి పాలపొంగళ్ళు సమర్పించి, వారి యొక్క మొక్కుబడులు తీర్చుకొనినారు. ఈరోజు కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్ ఏర్పాట్లు, ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా దర్శనం చేసుకొనుటకు దేవస్థాన చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్రబాబు, ఏర్పాట్లు పర్యవేక్షించినారు. కొండలమ్మ అమ్మవారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు, అవాంఛనీయ, సంఘటనలు కలగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ కె. సురేష్ బాబు, వారి సిబ్బంది తగు బందోబస్తు ఏర్పాట్లు చేసినారు. అని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.