BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం..

Select Suryaa Now
కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం..

కంకిపాడు, మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్య పండుగగా భావించే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో అధికారుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారితీశాయి. మండల కేంద్రమైన కంకిపాడులోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 7, 8, 9 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం పలువురు ఓటర్ల వేలిపై చెరగని సిరా గుర్తు సరిగా పడటం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిశీలించి ఓటర్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోలింగ్ సరళిని గమనించేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి పులి కామేశ్వరరావు విధుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించారు. అయితే ఓటర్ల ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థితో అధికారులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు అక్కడ జరుగుతున్న పరిణామాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత కాగా, వీడియోలు తీయడానికి అనుమతి లేదంటూ అడ్డుకోవడంపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అధికారులు, మీడియా విధులకు ఆటంకం కలిగించిన పోలీసుల తీరుపై స్థానికంగా చర్చ మొదలైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.