గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం....
మధురవాడ నవంబర్ 29 మేజర్ న్యూస్....
పీఎం పాలెం సమీపంలో ఉన్న పదో వార్డు టిడిపి కార్యాలయంలో ఆదివారం నాడు వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ ఆధ్వర్యంలో టిడిపి పదో వార్డు నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గరే గురునాథ్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపుమేరకు పదో వార్డ్ కార్పొరేటర్ గరే జ్యోతి గురునాథ్ ఆదేశానుసారం వార్డులో సమస్యలపై పరిష్కార దిశగా పయనించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వాటిలో ముఖ్యమైన సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా ఆచరణలోకి తీసుకురావాలని ఆయన కోరారు. అదేవిధంగా వార్డులో స్థానిక సమస్యలపై సమిష్టి బాధ్యతగా పనిచేసి వార్డును అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లేందుకు ప్రతి కార్యకర్త సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. వార్డులో ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని అభివృద్ధి చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. వారి అభిమానంతోనే మధురవాడలో అత్యధిక మెజారిటీ తో పదో వార్డ్ కార్పొరేటర్ గా గరే జ్యోతి గురునాథ్ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. ఆ అభిమానాన్ని స్వాగతిస్తూ ప్రజలకు అవసరమైన సమస్యలపై అహర్నిశలు కృషి చేసి తప్పకుండా వార్డును అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్, కొప్పాక రామకృష్ణ,మహిళా అధ్యక్షురాలు పెంటకోట బబ్బేలు,రెడ్డి సత్యనారాయణ,షేక్ సుభాని, కొల్లి బాబ్జి, షేక్ జహానారా,కోరగంజి సూరిబాబు, శివరామకృష్ణరాజు, పోతిన సతీష్, పోతిన నాయుడు, పోతిన సోమరాజు, పాపారెడ్డి, మామిడి రమణ,తదితరులు పాల్గొన్నారు.