BREAKING
కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా

క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు

Select Suryaa Now
క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్  కృతజ్ఞతలు


 

-  చర్చిల్లో ప్రార్థనలు.. కార్పొరేటర్‌కు ఘన సన్మానం

ఆరిలోవ, నవంబర్ 29, మేజర్ న్యూస్ :

జీవీఎంసీ,17వ వార్డులోని చర్చి ఫాస్టర్ల ఆహ్వానం మేరకు వార్డు కార్పొరేటర్ బుడుమూరి గోవింద్ వార్డు నాయకులతో కలిసి రాధాకృష్ణ నగర్‌లోని చర్చి, చినగదిలిరామలక్ష్మణపురంలోని చర్చిలను సందర్శించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులతో సమావేశమై ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు గోవింద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బుడుమూరి గోవింద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వార్డు అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం గార్డ్ మీరాకిల్ సెంటర్‌కు చెందిన జాన్ పీటర్, ఆఫొటో ఏపీహెచ్ చర్చికి చెందిన సామ్యూల్ బాబు కార్పొరేటర్ బుడుమూరి గోవింద్‌కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం దైవజనులకు స్వీట్లు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈగల కొండలరావు, పోతిన భరత్, తూర్పు నియోజకవర్గ ఐటీడీపీ ఇన్‌చార్జి బాదరు బాలరాజు, వానపల్లి గణేష్, ఒమ్మి కుమారి, రాజశేఖర్, సియ్యాద్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.