ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ
కంకిపాడు, మేజర్ న్యూస్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ పిలుపునిచ్చారు. కంకిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వాములు కావాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.