కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం
- అభినందనలు తెలిపిన పాస్టర్స్ అసోసియేషన్
ఆరిలోవ, నవంబర్ 29, మేజర్ న్యూస్ :
జీవీఎంసీ,16వవార్డు ధారపాలెం బంగారమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆర్. నరసింహరాజు ఇంటి వద్ద టి . షాలేం రాజు పాస్టర్ ఆధ్వర్యంలో ఆదివారం వార్డు కార్పొరేటర్ గా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, సాలువ కప్పి సన్మానించారు. ఈ సభలో ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్ ఎస్ నగర్ లో ఉన్న బ్రియల్ గ్రౌండ్ ( స్మశాన వాటిక ) సమస్యలను కార్పొరేటర్ కి తెలియజేశారు. కార్పొరేటర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి దిశగా నేను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, పెనుమర్శ వర్మ రాజు, తోరోతూ రాజు, సూరిబాబు, పి . బుజ్జి బాబు, శామ్యూల్ , సిహెచ్ . రత్నరాజు, కోర్నెల్ , కొండల గోవింద్,మీసాల గిరిబాబు,గురజాపు మెహన్, గురజాపు వాసు , పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు,