BREAKING
ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన సంతోషపురం సర్పంచ్

Select Suryaa Now
ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన సంతోషపురం సర్పంచ్

 

ప్రభుత్వ విప్ జగదీశ్వరికి పుష్పగుచ్ఛం అందజేసిన నకిరెడ్డి గౌరీశ్వరి

వైస్ ఎంపీపీ అంబటి రాంబాబు,నకిరెడ్డి వెంకట నాయుడు,అంబటి సర్వారాయుడు

గ్రామాభివృద్ధికి సహకరించాలని వినతి

గరుగుబిల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం సంతోష పురం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన నకిరెడ్డి గౌరీశ్వరి శనివారం కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిని మర్యాదపూర్వ కంగా కలిశారు.ఈసందర్భంగా సంతోష పురం సర్పంచ్ నకిరెడ్డి గౌరీశ్వరి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నకిరెడ్డి గౌరీశ్వరిని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసు కుని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంతోషపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా లని, గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం అందిస్తామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు అంబటి తవిటి నాయుడు (రాంబాబు), తెలుగుదేశం పార్టీ నాయకులు నకిరెడ్డి వెంకట నాయుడు, అంబటి సర్వారాయుడు, అంబటి రామకృష్ణతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.