BREAKING
ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

ఆరు పంచాయితీలు, 89వార్డు మెంబర్లు ఏకగ్రీవం

Select Suryaa Now
ఆరు పంచాయితీలు, 89వార్డు మెంబర్లు ఏకగ్రీవం

 

బరిలో 66మంది సర్పంచ్, 420మంది వార్డు మెంబర్ అభ్యర్థులు

మేజర్ న్యూస్,సాలూరు,  నవంబర్ 28

      మండలంలో 29పంచాయితీలకు గాను ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిదంగా ఆయా పంచాయితీల పరిధిలోని 89మంది వార్డు మెంబర్ స్థానాలకు యునానమస్ అయ్యారు. అలాగే మిగిలిన 23పంచాయితీలకు సంబంధించి సర్పంచ్ పదవి కోసం 66మంది, వార్డు మెంబర్లుగా 420మంది పోటీలో ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో 29పంచాయతీలు ఉండగా వాటిలో కొటియా గ్రూపు గ్రామాల పరిధిలోని గంజాయి భద్ర, పగులు చెన్నూరు పంచాయితీల నుండి తాడంగి లక్ష్మి, సీదరపు బిసులు సర్పంచులుగా ఏకగ్రీవం అయ్యారు. వీరితో పాటు గంజాయి భద్ర పరిదిలో ఉన్న 10వార్డులకు, పగులు చెన్నూరు పరిధిలోని ఎనిమిది వార్డులకు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఇది ఇలా ఉండగా మిగిలిన 23పంచాయితీలకు సంబంధించి 66మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ స్థానాలకు 420మంది బరిలో నిలిచారు. కాగా ఏకగ్రీవం అయిన వాటిలో పైన పేర్కొన్న కొటియా గ్రూపు పంచాయితీలతో పాటు పెద పదం నుండి మత్స రామ సాయి(మాజీ సర్పంచ్)సంపంగి పాడు నుండి గుడియా బద్రమ్మ, డెన్సరాయి - మర్రి లింగయ్య, కరడవలస - గమ్మెల సరోజినీలు వార్డు సభ్యులతో పాటు ఏకగ్రీవం అయినట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి పార్వతి తెలిపారు.