andhrapradesh
అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం
అవనిగడ్డ, నవంబర్ 28 మేజర్ న్యూస్: మండల కేంద్రమైన అవనిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేసన మూర్తి, 13, 14, 16 వార్డుల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు , యువనేత సింహాద్రి వికాస్ లు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రతి గడపకు వెళ్లి సర్పంచ్ అభ్యర్థి కేసన మూర్తితో పాటు 13వ వార్డు అభ్యర్థి నలకుర్తి మునేంద్ర, 14వ వార్డు అభ్యర్థి రాజనాల వెంకటేశ్వరరావు, 16వ వార్డు అభ్యర్థి చింతలపూడి వినయ్‌లను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, యువజన విభగం అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులు గాజుల జయ గోపాల్, మాజీ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, చింతలపూడి బాలు, నజీర్ భాష తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.