BREAKING
ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.…

పెదభోగిల గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా!

Select Suryaa Now
పెదభోగిల గ్రామస్తులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా!

 

అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు..

పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..నూతన సర్పంచ్ ఇచ్చాడ రాంబాబు

సీతానగరం, నవంబర్ 28, మేజర్ న్యూస్: మండలం పెదభోగిల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి, భారీ మెజారిటీ తో గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు, గ్రామ పెద్దలకు,యువతకు మరియు మహిళలకు సర్పంచ్ ఇచ్చాడ రాంబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సమయం లో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, మద్దతుదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ జేశారు.గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా,  గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని  స్పష్టం చేశారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం మరియు సంక్షేమ పథకాల ను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాజకీ యాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించ డమే తమ లక్ష్యమని ఈసందర్భంగా  వెల్లడిం చారు. మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు తానని  తెలిపారు.తనపై ఎంతో నమ్మకంతో అపూర్వ విజయాన్ని అందించిన పెదభోగిల గ్రామ పంచాయతీ ఓటర్లకు, గ్రామ పెద్దలు, అహర్ని శలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు,యువకులకు,మహిళలకు మరియు శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలకు అతీతంగా గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని  ఆయన వెల్లడించారు.