ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన మరుపెంట సర్పంచ్ పార్వతమ్మ
మరుపెంట సర్పంచ్ ఉడమల పార్వతమ్మకు ఎమ్మెల్యే అభినందనలు
ఎంపీపీ మరడాన నారాయణస్వామి, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు
ఉడమల సత్యనారాయణ,కండేన బలరాo,నారాయణరావు
ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో సర్పంచ్ మర్యాదపూర్వక భేటీ
గరుగుబిల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం మరు పెంట గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన ఉడమల పార్వతమ్మ కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిని శనివారం మర్యా దపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ) మరడాన నారాయణస్వామి, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు తదితరు లతో కలిసి సర్పంచ్ ఉడమల పార్వతమ్మ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిని కలిశారు.అనంతరం శాసనసభ్యులు తోయక జగదీశ్వరికి సర్పంచ్ ఉడమల పార్వతమ్మ పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.నూతన సర్పంచ్ ఉడమల పార్వతమ్మకు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హృదయపూర్వక అభినం దనలు తెలియజేశారు.ఎంపీపీ మరడాన నారాయణస్వామికి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.ఈసందర్భం గా ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరుపెంట గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిం చారు.గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులకు తన వంతు సంపూర్ణ సహకారం ఎల్ల ప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భరోసా ఇచ్చారు.అదే విధంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ మరడాన నారాయణస్వామి, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడమల సత్యనారాయణ,ఉప సర్పంచ్ కండేన చిన్నమ్మి,కండేన బలరాంనాయుడు,అక్కేన రామ క్రిష్ణ,అక్కేన నారాయణరావు,గండి స్వామినాయుడు,నగిరెడ్డి పోలి నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.