BREAKING
రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక

శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

Select Suryaa Now
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

రామాయంపేట;రామాయంపేట మండల పరిధిలోని కాట్రాల గ్రామ శివాలయంలో 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం, గంటాభిషేకం నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు