ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి
రామాయంపేట;మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణం లో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఎన్నో ఉద్యమాలు చేపట్టారని, విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సంఘ సంస్కరణలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. గులాంగిరి అనే పుస్తకాన్ని దాసి దేవి ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమంలో DBF జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు, వార్డ్ నెంబర్ టంకరి ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామల మహేష్, జాల శ్రీకాంత్, ఎస్టి నాయకులు వినోద్ నాయక్, ఓజ్జ కొమురయ్య, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.