జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్ అడ్వెంచర్ క్యాంప్‌కు అనురాగ్ విద్యార్థులు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:
హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్ అడ్వెంచర్ క్యాంప్–2026లో పాల్గొనేందుకు అనురాగ్ యూనివర్సిటీకి చెందిన తొమ్మిది మంది విద్యార్థులకు అవకాశం లభించింది. నవంబర్ 21 నుంచి 30 వరకు హట్కోటిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి నలుగురు బాలురు, ఐదుగురు బాలికలు, ఒక కంటింజెంట్ లీడర్ పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో విద్యార్థులకు పర్వతారోహణ, సాహస క్రీడలు, ప్రకృతి అన్వేషణ, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బృంద స్ఫూర్తిపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్చన మంత్రీ, ఎన్‌ఎస్‌ఎస్ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఆర్. సైదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్‌లతో విద్యార్థుల బృందం గ్రూప్ ఫొటో దిగింది.ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, సోషల్ లెర్నింగ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లేశ్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎన్‌ఎస్‌ఎస్ గొప్ప వేదికని, ఇలాంటి శిబిరాలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పించిన యూనివర్సిటీ యాజమాన్యానికి, ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టరేట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.