BREAKING
రామాయణంలో సీత పాత్రపై ట్రోలింగ్.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు ఉరేసుకొని మహిళ మృతి?! బాలకృష్ణ దాదా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. డిసెంబర్ 24నే థియేటర్లలోకి చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక

పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా

Select Suryaa Now
పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను పాలకులు విస్మరిస్తున్నారని సీపీఎం సీనియర్ నాయకులు చింతల యాదయ్య, మండల కార్యదర్శి ఎన్. సబిత విమర్శించారు. అందరికీ విద్య అందించడమే పూలే దంపతుల ప్రధాన ఆశయమని, నేడు పేదలకు విద్యను దూరం చేసే విధానాలు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ఘట్‌కేసర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం చింతల యాదయ్య, ఎన్. సబిత మాట్లాడుతూ పూలే దంపతులు జీవితాంతం అందరికీ విద్య అందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. జాతీయ విద్యా విధానం పేరుతో పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మనువాద భావజాలం కొనసాగినంతకాలం దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పూలే స్ఫూర్తితో యువత, మేధావులు, ప్రజలు సామాజిక అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య కాషాయీకరణతో పాటు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు, దాడులను అరికట్టి సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యురాలు కుడుకుంట్ల అలివేలు, బి. సునీత, దేవి, రజిత, సంజన, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.