BREAKING
చదువుతోపాటు క్రీడలలో పోటీ తత్వం ఉండాలి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్‌లో ఫ్యూచర్ ఎక్స్‌–2026 కూలీల స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువ.. నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ వృషకర్మ తొలి పది నిమిషాలు మిస్ కావొద్దు.. డిసెంబర్ 4న విడుదల: కార్తీక్ దండు అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. నవోదయ ప్రవేశ పరీక్ష లకు 77.17 శాతం మంది విద్యార్థుల హాజరు సమానత్వ సాధనకు జ్యోతిరావు పూలే జీవితం స్ఫూర్తిదాయకం:నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గుండారెడ్డిపల్లి లో రైతు వేదికల లో నేల ఆరోగ్య కార్డుపై అవగాహన సదస్సు భారత రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన అవసరం… ఎం.పీ రఘునందన్ రావు సూర్య పత్రికకు స్పందన నేను డ్యాన్స్ చేసినా ఏఐ అంటారేమో.. మమ్ముట్టి సరదా వ్యాఖ్యలు వైరల్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంజేపీ తునికి విద్యార్థి ఎంపిక పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.… లక్ష్మాపూర్ విద్యార్థికి రీల్స్ పోటీల్లో ప్రథమ బహుమతి జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్‌ అడ్వెంచర్‌ క్యాంప్‌కు అనురాగ్‌ విద్యార్థులు

మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం

రామాయంపేట;మహిళా విద్య, సమానత్వం, సామాజిక అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబాపూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్‌ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు అన్నారు. రామాయంపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాల సన్నిధిలో 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు.పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి సుప్రభాత్ రావు మాట్లాడుతూ.. మహిళలకు విద్యను అందించడంతో పాటు సమాజంలో సమాన హక్కులు కల్పించేందుకు మహాత్మా జ్యోతిబాపూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలులో భాగంగా మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలని కోరారు. అప్పుడే బీసీ మహిళలకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు, పోరాటాలు సాగాయని, ప్రస్తుతం ఈ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి వారి రాజకీయ, సామాజిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చౌదరి సుప్రభాత్ రావు, అబ్రహం గంగారం, భూమ సిద్ధరాములు, దోమకొండ యాదగిరి, లంబాడి సురేష్, పాతూరి రాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.