రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం
రామాయంపేట;డిసెంబర్ 12న పటాన్‌చెరువులో నిర్వహించనున్న అయ్యప్ప స్వామి కోటి నామార్చన మహోత్సవాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో చేపట్టిన ప్రచార రథయాత్ర శనివారం రామాయంపేట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్‌తో పాటు అయ్యప్ప స్వాములు, భక్తులు ప్రచార రథానికి ఘన స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అయ్యప్ప జ్యోతిని పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా భక్తుల నామస్మరణలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి, డిసెంబర్ 12న పటాన్‌చెరువులో జరగనున్న కోటి నామార్చన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మార్కు నగేష్, ఎనిశెట్టి రమేష్ గుప్తా, నాగరాజు గుప్తా, బాసం శ్రీనివాస్, ప్రవీణ్ గుప్తా, దోమకొండ శీను, దేవుని రంజిత్‌తో పాటు పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.