ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ
ఘట్కేసర్, మేజర్ న్యూస్: ఘట్కేసర్ శివారులోని శివారెడ్డిగూడలో బంధన్ ఫంక్షన్ హాల్ సమీపంలో శనివారం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. మదనగిరి సురేష్ గౌడ్, ఆయన తనయుడు అనూష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ వేడుకకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, అయ్యప్ప నామస్మరణల మధ్య మహా పడిపూజ భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారులు, స్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీంతో పరిసర ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.