BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి బీసీ మహిళలకు జనాభా నిష్పత్తి ప్రకారం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Select Suryaa Now
మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి బీసీ మహిళలకు జనాభా నిష్పత్తి ప్రకారం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

రామాయంపేట;రామాయంపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాల సన్నిధిలో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళులర్పించారు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దాకి స్వామి, దేవుని రంజిత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ముఖ్యంగా మహిళా విద్య, మహిళల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు విద్య ద్వారానే సమాన హక్కులు, గౌరవం లభిస్తాయని నమ్మి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో భాగంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ మహిళలకు సైతం జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ మహిళలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఈ అంశం కార్యరూపం దాల్చే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో బీసీ మహిళలకు కూడా న్యాయం జరగాలని వారు స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చౌదరి సుప్రభాత్ రావు, అబ్రమైన గంగారం, భూమ సిద్ధరాములు, దోమకొండ యాదగిరి, చింతల యాదగిరి, చింతల స్వామి, విప్లవ కుమార్, లంబాడి సురేష్, పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు.