జల్ పల్లి సర్కిల్ లో పర్యటించిన అక్బరుద్దీన్ ఓవైసి
జల్ పల్లి, మేజర్ న్యూస్.
జల్ పల్లి సర్కిల్ అభివృద్ధి కోసం మజ్లిస్ పార్టీ ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేసిందని రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలో మజ్లిస్ ను అదరిస్తే కొత్త నగరంకు దిటుగా జల్ పల్లి సర్కిల్ ను అభివృద్ధి చేస్తామని
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి అన్నారు. ఆదివారం జల్ పల్లి సర్కిల్ లో ఎర్రకుంట, సాధత్ నగర్, బిస్మిల్లాహ్ కాలనీ, కొత్త పేట్, షాహిన్ నగర్, వాదిఏ ముస్తఫా పహాడిషరీఫ్, తదితర ప్రాంతాలలో పర్యటించి మజ్లిస్ కార్యాలయాలను ప్రారంభించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం అయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు, ఈ కార్యక్రమం లో మజ్లిస్ నాయకులు, సమద్ బిన్ అబ్దాడ్, మొహసిన్ బలాల, మజ్లిస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అహ్మద్ సాది, మాజీ చైర్మన్ అబ్దుల్లా సాది, మాజీ మండల ఉపాధ్యక్షుడు ఓమర్ బామ్, మజ్లిస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.