BREAKING
శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత

కోళ్ల ఫామ్ లో యువకుడు మృతి.

Select Suryaa Now
కోళ్ల ఫామ్ లో యువకుడు మృతి.

కోళ్ల ఫామ్ లో యువకుడు మృతి 
=================
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....

అనుమానాస్పద స్థితిలో కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్న  యువకుడు మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం పాత కారాయి గూడెం గ్రామ శివారులోని కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్న యాదాల వంశీ (25) ఆదివారం ఉదయం తను పనిచేస్తున్న  కోళ్ల ఫామ్ లో విగత జీవుడుగా కనిపించాడు. దమ్మపేట మండలం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన  యాదాల వంశి, తన భార్యతో కలిసి కోళ్ల ఫామ్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భార్య వైద్య చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం దమ్మపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి  భార్యను వారి వద్దనే వదిలి రెండు రోజుల క్రితం ఒక్కడే కోళ్ల ఫారం వద్దకు పనికి వచ్చాడు. ఆదివారం ఉదయం కోళ్ల ఫారం యజమాని తమ్ముడు కోళ్ల ఫారం లో మృతి చెందిన వంశీని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వియం బంజర్ పోలీసులు పరిశీలించి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు రెండు సంవత్సర క్రితం పెద్దలను ఎదిరించి కులాంతర ప్రేమ వివాహం చేసుకుని భార్య కలిసి కోళ్ల ఫామ్ లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు నెలల క్రితం కడుపులోనే బిడ్డను కోల్పోయిన భార్య రజిని భర్త వంశీని కూడా కోల్పోవడంతో  ఒంటరిగా మిగిలిపోయింది.  ఈ ఘటనపై ఎస్ఐ షేక్ షాకీర్  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వంశీ మృతి గల కారణాలు విచారణలో తేలనున్నాయి.