BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

రాజకీయ విమర్శలు చేయండి.. వితంతు మహిళలను కించపరచకండి

Select Suryaa Now
రాజకీయ విమర్శలు చేయండి.. వితంతు మహిళలను కించపరచకండి


సండ్ర వ్యాఖ్యలను ఖండించిన పెనుబల్లి కాంగ్రెస్ పార్టీ 

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....

బిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఓ సమావేశంలో వితంతు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విఎం బంజర్  గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు భుక్కా కృష్ణవేణి ఇంటి వద్ద ఆదివారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భుక్కా కృష్ణవేణి, మండల పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వితంతు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో  అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అందిస్తుందని విమర్శించేందుకు అవకాశం లేక ఏదేదో మాట్లాడుతున్నారని దేవా చేశారు. ముగ్గురు మంత్రులపై ప్రభుత్వంపై ముండమోపి అనే పదం వాడటం విచారకరమని వితంతు మహిళలను అవమానపరచడమేనని అన్నారు. ముండమోపి అంటే అర్థం తెలుసా అని వారు ప్రశ్నించారు. వితంతువైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించి ఉక్కు మహిళగా పేరుగాంచినదని గుర్తు చేశారు.
రాజకీయ విమర్శలు, సూచనలు చేయలే కానీ  మహిళల వ్యక్తిగత జీవితాలను, వారి వైధవ్యాన్ని కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు బొక్క కృష్ణవేణి, జిల్లా నాయకులు కీసర శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధ్,గూడూరు మాధవరెడ్డి, నర్వోత్తమ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పాకలపాటి సతీష్, వంగ గిరిజపతి, శీలం వెంకటేశ్వర్ రెడ్డి, దొంతు మాధవరావు, వంగా చంద్ర శేఖర్, అన్నపురెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.