శ్రీరామ కాలనీలో పర్యటించిన షేక్ జహంగీర్.
జల్ పల్లి, మేజర్ న్యూస్. జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని జల్ పల్లి 65వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం శ్రీరామ కాలనీ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ జహంగీర్ మాట్లాడుతూ. గత పాలకుల చేతిలో శ్రీరామ కాలనీ వెనకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు, కాలనీలో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కాలనీలో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా నివాసం ఉంటారని, ప్రస్తుతం ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అంతర్గతమయ్యాయని, వాటి పరిష్కారానికి గత పాలకులు పట్టించుకోలేదని వాపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యలు తీరిన తర్వాతే, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతానని షేక్ జహంగీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.