మాజీ మంత్రిని కలిసిన ఉద్యమకారుడు..!
మునిపల్లి;తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును మునిపల్లి మండల తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బండారి పాండు కురుమ కలిశారు. శనివారం అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ల ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనం పని చేస్తూ పోతే ఏదో ఒక ఫలితం వస్తుందని, నాయకులను, కార్యకర్తలను గుర్తించి తగు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హదీర్ బాయ్, గౌస్ మాల్యా, తదితరులు పాల్గొన్నారు.