BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

రామాయంపేట;మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అన్నారు. మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఆర్యవైశ్య భవన్‌లో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధి ఎంబ్రాయిడరీ వర్క్ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా తమలోని ప్రతిభను గుర్తించి, ఇలాంటి శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకొని వాటిని మెరుగుపరుచుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని అన్నారు. ఇతర మహిళలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, దేవుని రంజిత్, డాకి శ్యామల స్వామి, కో-ఆప్షన్ సభ్యులు ఆసియా సుల్తానా, చింతల రాధా భవాని యాదగిరి, మైనారిటీ అధ్యక్షుడు తాహిర్, సంబంధిత అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.