telangana
గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు
సూర్య, శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని వంకాయగూడెం, మొలంగూర్ గ్రామపంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీల నిర్వహణ, రికార్డుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎంపీఓ, వంకాయగూడెం సర్పంచ్ వెన్నం మల్లేశం, మొలంగూర్ సర్పంచ్ పూదారి రాజు, పంచాయతీ కార్యదర్శులు, డీపీఎం తదితరులు పాల్గొన్నారు.